పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, విశాఖపట్నం పార్లమెంటు (లోక్ సభ) సభ్యుడు శ్రీభరత్ మతుకుమిల్లి తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి ఆదివారం కోటి రూపాయల చెక్కును అందజేశారు. గీతం ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఈ చెక్కును స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీభరత్ పాటు పూర్వ ఐఏఎస్ అధికారి-గీతం ముఖ్య పరిపాలనాధికారి (సీఏవో) బీ.ఆర్, మీనా, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులున్నారు.కొద్ది రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్కును విరాళంగా అందజేసిన విషయం విదితమే.సామాజిక బాధ్యత, మానవతా సాయం పట్ల తను అంకితభావాన్ని ప్రతిబింబిస్తూ, క్లిష్టమైన సమయాలలో సహాయ చర్యలకు మద్దతు ఇవ్వడానికి గీతం యొక్క నిబద్ధతను ఈ ఉదార విరాళాలు చాటిచెబుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…