118 మంది లబ్ధిదారులకు 43 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు మంజూరైన 43 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు అందించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, నరసింహారెడ్డి, వెంకటేష్, రాము, రాజు, సంజీవరెడ్డి, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…