పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని పాటి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ ముఖద్వారంలో నిర్మించిన స్వాగతం తోరణాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం గొర్రె పిల్ల, గొంగడి కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు తన వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు స్వామి గౌడ్, భూపాల్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…