Districts

అమీన్ పూర్ ప్రభుత్వ భూముల వేలం వెంటనే నిలిపివేయాలి_-బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి

మన వార్తలు ,పటాన్ చెరు:

ఆదాయ వనరుల కోసం ప్రభుత్వ భూములను అమ్మడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి  స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని 31 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేాశారు. వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని లేదంటే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆర్ సీపురంలో శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు పత్రికా, మీడియా సమావేశం   మాట్లాడుతూఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్‌, శిఖం, అటవీ, దేవాదాయ, భూదాన, వక్ఫ్‌, మిగులు భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉన్న భూములను కూడా అమ్మాలని నిర్ణయించడం సరికాదన్నారు.

అమీన్ పూర్ లోని 343 సర్వే నెంబర్ లోని 31 ఎకరాల భూమిని వేలం వేసేందుకు గత నెలలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ (TSIIC) ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారని గోదావరి అంజిెరెడ్డి గారు వెల్లడించారు. మార్చి 24 న ఆన్ లైన్ విధానంలో భూముల వేలం వేస్తున్నారని గజానికి 40 వేలుగా రిజర్వు ధర నిర్ణయించి.కనీసం 613 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆమె తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కేవలం ఖజానా నింపుకునేందుకు విలువైన భూములను అమ్మడాన్ని ఆమె తప్పుబట్టారు. అమీన్ పూర్ మండలంలో పోలీస్ స్టేషన్, మున్సిపాలిటీ, ప్రభుత్వ ఆస్పత్రి, తహశీల్దార్ , ఎంపీడీవో కార్యాలయం, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు సరిపడా భూములు కేటాయించకుండా ఆదాయం కోసం భూములను ఎలా విక్రయిస్తారని గోదావరి అంజిరెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

సరైన భవనాలు లేక అద్దె, ఇరుకు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయని, వాటి నిర్మాణాలకు భూములు కేటాయించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు లేవని చెప్పే సర్కారు ఇప్పుడెలా భూములను అమ్ముతోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, నిరు పేదల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు 31 ఎకరాలను వెంటనే కేటాయించాలని కోరారు. ప్రభుత్వానికి ఆదాయం పైన ధ్యాస తప్ప నిరుపేదల సంక్షేమం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అమీన్ పూర్ భూముల వేలాన్ని నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆమె విమర్శించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago