– కిర్బీ పరిశ్రమలో వరసగా నాలుగవసారి సిఐటియు విజయ దుందుభి
– బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు గెలుపు
– ఎన్ని కుయుక్తులు పన్నిన … విజయం ఎర్రజెండాదే
– పరిశ్రమలో కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
బాణసంచా కాల్చి, సంబురాలలో మునిగిన కార్మికులు
ఈ విజయం కిర్బీ కార్మికులకు అంకితం
కిర్బీ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మండలంలోని పాశం మైలారం పారిశ్రామిక వాడ లో గల కిర్బీ పరిశ్రమలో గురువారం జరిగిన కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియు నాలుగోసారి విజయ దుందుభి మోగించింది. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు,బిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు బరిలో నిలిచారు. పరిశ్రమలో మొత్తము 578 ఓట్లకు గాను 576 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లలేవు, సీఐటీయూ కి 295, బిఆర్టీయూ కూటమికి 281 ఓట్లు రాగా 14 ఓట్ల తేడాతో బిఆర్టియూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న సిఐటియు ఎర్రజెండా ను వరుసగా నాలుగవసారి గెలిపించిన కిర్బీ కార్మికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. సిఐటియు గెలుపుతో కార్మికుల జీవితాలు బాగుపడతాయని నమ్మిన కార్మికులు భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధించేందుకు ఈ గెలుపు దోహదపడుతుందని అన్నారు. సిఐటియుతోనే కార్మికులకు రక్షణ ఉంటుందన్నారు.
కార్మికులకు ఇచ్చిన హామీలన్నిటిని రాబోయే రోజుల్లో నెరవేర్చే విధంగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని యూనియన్లు కూటములుగా ఏర్పడిన, ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ ఎర్రజెండాదే విజయన్నారు. ఈ గెలుపు కార్మికుల విజయం గా ఆయన అభివర్ణించారు. సీఐటీయును కార్మికులు ఆదరించి నాలుగవసారివిజయం అందించిన కార్మికులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.గెలిచిన వెంటనే పరిశ్రమలో కార్మికుల సంబురాలు అంబరానంటాయి. నాయకులను రంగులతో ముంచెత్తి సంబరాలు చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కే రాజయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు పి మల్లేశం పాశమైలారం పారిశ్రామిక వాడ క్లస్టర్ కన్వీనర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ..మానిక్, పి. పాండురంగ రెడ్డి, కిర్బీ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రాజు, యూనియన్ నాయకులు తలారి శ్రీనివాస్, నాగప్రసాద్, రాములు, లకన్, జైపాల్, సోమన్న, ప్రవీణ్, శంకర్, బిలాల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…