Districts

అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరాలకు అనుసరణీయం

_అంబేద్కర్ కు ఘన నివాళి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు. అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. దళిత సామాజిక వర్గంలో ఈ పథకం పెను విప్లవం తీసుకొని రాబోతుందని అన్నారు.

admin

Recent Posts

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

20 hours ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

20 hours ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

20 hours ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

20 hours ago

గీతంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ (జీఎస్ఎస్) హైదరాబాదులోని లైఫ్ సైన్స్ విభాగం ‘ఆహార శుద్ధి…

20 hours ago

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 days ago