-చిట్కుల్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
-పూలమాలలు వేసి, నివాళులర్పించిన ఎంపీ అభ్యర్థి నీలం మధు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికీ స్ఫూర్తిదాయకమని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నీలం మధు ముదిరాజ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఎంపీ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలంతా ఎల్లవేళలా కృతజ్ఞతతో ఋణపడి ఉంటామని ,విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహౌన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ,అంబేద్కర్ అందరివాడు కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని , ఎంతకాలం బ్రతికామన్నది కాదని ప్రజలతో ఆదరణ పొందే విధంగా ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని నీలం మధు ముదిరాజ్ అన్నారు .ఈ కార్యక్రమంలో చిట్కుల్ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు చిన్న, వైస్ ప్రెసిడెంట్ రాజు, ప్రవీణ్ అనిల్, మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పి నారాయణ రెడ్డి, వి నారాయణ రెడ్డి, నరసింహులు, వెంకటేష్, ఈవో కవిత, వార్డు మెంబర్లు వెంకటేష్, మురళి, ఎన్.ఎం.ఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…