Telangana

భావవ్యక్తీకరణపైనే విజయం ఆధారపడి ఉంటుంది

-జర్నలిజంపై హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్ సోమశేఖర్ వ్యాఖ్య

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

జర్నలిజంలో విజయం సాధించాలంటే భావవ్యక్తీకరణ, ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ సోమశేఖర్ ములుగు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎహెచ్ఎస్)లోని మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్  విభాగం ‘జర్నలిజంలో మార్గదర్శనం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై సోమవారం అతిథ్య ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.జర్నలిజం ఐదు దశల గురించి (1950-90 ప్రతికలు, రేడియో: ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో 1991 నుంచి ఫెనాన్షియల్ న్యూస్ పేపర్ల్ ఆగమనం: గూగుల్ సృద్ధితో 2000 నుంచి డిజిటల్ మీడియా: 2010-20 సోషల్ మీడియా నిబృంభణ: ఇక కోనిడ్ నేపథ్యం, కృత్రిమ మేథల సాయంతో వర్తమాన పాత్రికేయం), సాంకేతిక పురోగతితో పరిశ్రమ, పాత్రికేయం ఎలా రూపాంతరం చెందాయో సోమశేఖర్ వివరించారు. ప్రారంభ దశంలో సంప్రదాయ వార్తాపత్రికలు, రేడియో నుంచి ఇటీవలి డిజిటల్ మీడియా, సామాజిక వేదికల అనిర్భావం వరకు, మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం నిరంతరం అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

జర్నలిజంలో మంచి రచన, మాట్లాడే నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన సోమశేఖర్, కంటెంట్ రెటింగ్, ఫ్రీలాన్స్ అవకాశాలను అన్వేషించాలని ఔత్సాహిక పాత్రికేయులను ప్రోత్సహించారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల పెరుగుదలను ప్రస్తావిస్తూ, ఇక్కడ ఆయా వ్యక్తులు తను ప్రతిభను ప్రదర్శించవచ్చని, తాము అనుకున్నది ఎటువంటి పరిమితులు లేదా నిబంధనల చట్రం వంటివి లేకుండా చెప్పొచ్చని, సొంత ప్రేక్షకులు / వీక్షకులను పొందవచ్చని చెప్పారు.వర్ధమాన జర్నలిస్టులు తమ నెపుణ్యం ఆధారంగా మీడియాను ఎంచుకోవాలని, మంచి కథనం, దానిని ఆకట్టుకునేలా చెప్పగలిగే సామర్ధ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని సోమశేఖర్ సూచించారు.తొలుత, జీఎహెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని స్వాగతించారు, మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడగమ్మ బాలకృష్ణ సోమశేఖర్ ను సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గామన్ పాలెం వందన సమర్పణ చేశారు. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను అడిగి, నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago