_కర్థనూరు బీరప్పల దేవస్థానం నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల విరాళం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోదారణ చేసేందుకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అక్క మహంకాళి బీరప్ప స్వామి, కామారతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆలయ నిర్మాణానికి 6 లక్షల రూపాయల విరాళం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవర్ధించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, తదితర దేవస్థానాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దారని అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో గుడి నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిధులు సేకరించడం జరిగిందని గ్రామ ఉపసర్పంచ్ వడ్డే కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…