రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
హిందూ ముస్లీంల మత సామరస్యానికి పండుగలు ఎంతగానో దోహదపడతాయని ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పెద్ద మసీదు వద్ద వెయ్యి మంది పేద ముస్లీం కుటుంబాలకు పది లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏకే ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్పండుగను ప్రతి ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలన్నారు . నిరుపేదల ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 కేజీల సన్నబియ్యం, కేజీ కందిపపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ సెమియా, కేజీ చక్కెర, లీటరు వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందించారు.
రంజాన్ పండగను అందరు కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో ,ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఏకే ఫౌండేషన్ ఏర్పాటు చేశామని సంస్థ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం రంజాన్ పండుగను పురస్కరించుకొని తోఫాలను అందజేశామన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…