కనీస వేతనం అమలు చేయాలనీ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా
ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు .ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునేప్ప మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న మీటర్ రీడర్లకు ప్రత్యన్న ఉపాధి చూపించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ లో ఐటిఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను అలాగే వాచ్ అండ్ వార్డ్ గా నియమించాలనీ నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసులో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్ గాను, అటెండర్స్ గా, వాచ్మెన్ గాను నియమించాలి. 12 రోజులు రీడింగ్ అనంతరం మీటర్ రీడర్లను డిలిస్టులకు మీటర్లు మార్చడంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏడిఈ నాగేంద్ర ప్రసాద్ గారు వినతిపత్రం ఇవ్వడం అందించారు .ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ల రీడింగ్ యూనియన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, వీర శేఖర్, ఉరుకుందు,ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, పట్టణ కార్యదర్శి విజేంద్ర, కుమార్ స్వామి, నరసప్ప, చంద్రశేఖర్, నరసింహులు, జోష్ రాజ్, ఉప్పర ఉరుకుందు, కిరణ్ కుమార్, రంగన్న, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…