Telangana

కలర్స్ హెల్త్ కేర్’లో ఐశ్వర్య రాజేష్ సందడి

▪️ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి

▪️ ఘ‌నంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్స‌వం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘

సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ ఫేమ్‌ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాల‌జీతో ఈ సంస్థ‌ అందిస్తున్న సేవ‌ల‌ను ఆమె స్వ‌యంగా ప‌రిశీలించింది.అనంత‌రం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్య‌మ‌ని, ఈ సేవ‌ల‌ను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాల‌జీతో అందిస్తున్న ‘క‌ల‌ర్స్‌’ సంస్థ నిర్వాహ‌కుల‌ను ఆమె అభినందించింది. ప్ర‌తి ఒక్క‌రూ అందంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటాము. అలాంటి సేవ‌ల‌ను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్య‌ప‌రంగా సంతృప్తి ప‌రిచిన‌ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ అని కొనియాడారు. ”లైఫ్‌స్టైల్ బాగుండాల‌ని కోరుకునే వారంద‌రికీ ఈ సంస్థ మెరుగైన సేవ‌లు అందిస్తూ ఇప్పుడు ఆధునిక సాంకేతిక‌త‌ను జోడించుకుని ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా ఎద‌గ‌డం సంతోషం. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి” అని ఐశ్వర్య రాజేష్ ఆకాంక్షించారు.

కలర్స్ హెల్త్ కేర్’ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన ‘కలర్స్ హెల్త్ కేర్‌’ సేవ‌ల‌కు మ‌రింత అడ్వాన్స్ టెక్నాల‌జీని జోడిస్తూ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్ప‌టికీ 50 బ్రాంచీలు ఉన్న త‌మ ‘కలర్స్ హెల్త్ కేర్‌’ను వ‌చ్చే ఏడాది చివ‌రి క‌ల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ రాయుడు మాట్లాడుతూ.. యూఎస్ – ఎఫ్డీఏ అఫ్రూవుడ్ టెక్నాల‌జీతో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అతిథులుగా పాల్గొన్న‌ మిన‌ర్వా హోట‌ల్స్ అధినేత‌, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్ట‌ర్ దివ్యారెడ్డి నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago