Hyderabad

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు

దూకుడే తన లక్షణం … టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి
– ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారు

హైదరాబాద్:

పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ చీఫ్ , కాంగ్రెస్ నుంచి టీఆర్ యస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపుడే అని రేవంత్ రెడ్డి అంటే ఆయనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , గండ్ర వేంకటరమణ రెడ్డి , సుధీర్ రెడ్డి లు … ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ , టీపీసీసీ పదవిని 25 కోట్లకు కొనుక్కొని వచ్చిన నీవా మాకు నీతులు చెప్పేది ..ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకో , మాటలు జాగ్రత్తగా రానివ్వు…మావోయిస్టులు మాట్లాడే భాషామాట్లాడుతున్నావ్ … తెలుగు దేశంలో గెలిచినా నువ్వు పార్టీ మారినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు …. మేము పద్దతి ప్రకారమే పార్టీ మారం … అనవసరం మాట్లాడితే కేసులు పెడతాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దీనిపై రేవంత్ అదే స్థాయిలో వారికీ జవాబు ఇచ్చారు… తన దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేశారు…..

కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచి సిగ్గులేకుండా అధికార పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాక, ఇటీవల వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. దానిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన మాటలతూటాలను మళ్లీ పేల్చారు.
తాను గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి ప్రతిపక్షంలో చేరానని వెల్లడించారు. అంతకుముందు జడ్పీటీసీగానూ ఇండిపెండెంట్ గానే గెలిచానని తెలిపారు. అప్పుడు తాను కేసీఆర్ కు సహకారం అందించానని, తెలంగాణ సాధన కోసమే అప్పట్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చానని రేవంత్ రెడ్డి వివరించారు.
ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, త్వరలోనే ఘర్ వాపసీ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. దూకుడు తన సహజ లక్షణం అని, అది మారదని అన్నారు. ఇక పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టిచంపుడేనని తన వైఖరి స్పష్టం చేశారు.

Venu

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago