– అలరించిన మూడు రోజుల సాంకేతిక-సాంస్కృతికోత్సవం
– మిన్నంటిన కోలాహలం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ‘ప్రమాణ-2024’ పేరిట నిర్వహించిన మూడు రోజుల సాంకేతిక- సాంస్కృతికోత్సవం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో వర్సిటీలోని విద్యార్థులు వివిధ రంగాలలో తమ ప్రతిభ, నై పుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొన్నారు. ప్రమాణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాసన కామినేని కొణిదెల, గౌరవ అతిథిగా విచ్చేసిన విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జి. వంశీకృష్ణ ఫెస్ట్ ను లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. లింగ భేదం లేకుండా విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఉపాసన హితవు పలికారు. వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను బట్టి ఆయా రంగాలను ఎంచుకుని, అందులో రాణించాలని వంశీ సూచించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ట్రెజర్ హంట్, డాన్స్ వర్క్ షాప్ , ఆటో ఎక్స్ పో , బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ వంటి అనేక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు.
వీటికి అదనంగా, వర్క్ షాప్ లు , వివిధ పోటీలు, పాటలు, ర్యాంప్ వాక్, నృత్యాలు వంటి సాంకేతిక-సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి తోడ్పడ్డాయి. కళాకారుల ప్రతిభా ప్రదర్శన విభాగంలో, నేపథ్య గాయకులు రామ్ మిరియాల, సాహితీ చాగంటి సినీ పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్ టీఈ డేటా ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, పలు పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
ఇక చివరి రోజు ప్రాజెక్ట్ 91, నినా సుర్దాతో కూడిన డీజే నెట్తో ఫెస్ట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమం విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంగీత యాత్రను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలు, ఇతరత్రా కార్యక్రమాలలో జంట నగరాలలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని, తమ ప్రతిభా, నెపుణ్యాలను ప్రదర్శించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు పర్యవేక్షణ, మార్గదర్శనంలో రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లెఫ్ట్ అధికారి జియో సిరిల్ పొడిపర, పలువురు అధ్యాపకులు, కోర్ కమిటీ ఈ ఫెస్ట్ ను పర్యవేక్షించి, విజయవంతంగా పూర్తయ్యేలా కృషిచేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…