అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
నిజాం నిరంకుశ వ్యతిరేక పాలక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పటాన్చెరు బీజేపీ నేత ఎడ్ల రమేష్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ పద్మశాలిసంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణ ఉద్యమంలో 85 సంవత్సరాల వయస్సులో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహదాతగా తనకు అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు. పద్మశాలి సంఘం నేతలు ఎక్కడ విగ్రహం పెట్టాలో నిర్ణయిస్తే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసంమూడు దశల్లో ఉద్యమాల్లోప్రముఖ పాత్ర పోషించారని ఎడ్ల రమేష్ కొనియాడారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల స్వప్నం మాత్రం ఆయన చూడలేకపోయాడన్నారు. నిరంతరం ప్రజాసేవ కోసం తపించే వ్యక్తి సేవలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…