మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్ డిపో కార్మికులు బిజెపి సీనియర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు.. యూనియన్లను పునరుద్ధరించాలని, 2021, 2025 వేతన సవరణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సహా అన్ని సమస్యలను ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్న కార్మికులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక వారి డిమాండ్లను పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు చేస్తున్న పోరాటానికి ఆర్టీసీ కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని.ఇకనైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేష్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము, రాఘవేంద్ర, దరగయ్య, సుభాష్ గౌడ్, శ్రీనివాస్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…