Telangana

ఆపత్కాలంలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్  నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పేదలకు వైద్యం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపత్కాలంలో ఆపన్న హస్తంల ఆదుకుంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను ఆయన స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీశైలం, రుద్రారం మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, ముత్తంగి అశోక్, మధుసూదన్,పాండు యాదవ్, యాదయ్య,ch వెంకటేష్, ప్రభు, కిట్టు ,రాఘవేంద్ర, మహేష్, గోపాల్, శ్రీనివాస్,అనిల్, గణేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

7 minutes ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago