▪️ శరత్ సిటీ మాల్‌లో 3 రోజుల పాటు ఈవెంట్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (ఏఎంబి మాల్ ) కొండాపూర్‌లో వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది.ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, “ఈవెంట్ చాలా వైవిధ్యంగా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి నమ్మకమైన బ్రాండ్ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని పేర్కొన్నారు. గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు హెబ్బా పటేల్ సందడి చేసి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…