_హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడంతో పాటు, యాదగిరిగుట్ట, కొండగట్టు, వేములవాడ, ఏడుపాయల తదితర దేవస్థానాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో 175 కు పైగా దేవాలయాలను నిర్మించినట్లు తెలిపారు. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల నిర్మాణాలకు సైతం సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరి అందర్నీ అలరించింది.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్యకాశి రెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, మెరాజ్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…