Telangana

బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం

_జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

జిహెచ్ఎంసి పరిధిలోని ప‌టాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సత్వరమే నిధులు కేటాయించాలని బల్దియ కమిషనర్ లోకేష్ కుమార్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.డివిజన్లో అభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై ఇటీవల రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాదులోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమయ్యారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల నిధులు, కేటాయించడంతోపాటు, ప‌టాన్ చెరు ఫుట్ ఓవర్ బ్రిడ్జి , వరద నీటి కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే త్వరితగతిన పనులు చేపడతామని ఆయన తెలిపారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago