Telangana

ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలి

తక్షణం మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి

పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలి

ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు , గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలి

పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శ జాన్ వెస్లీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే ఇక్కడికి రప్పించాలని,ఈ దుర్ఘటనపై సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుపించాలని, తక్షణం మృతుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈరోజు పాశం మైలారం ప్రాంతంలో పేలిన సిగాచి పరిశ్రమ ప్రాంతాన్ని సిపిఎం ప్రతినిధి బృందంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి 50 లక్షలు.. గాయపడ్డ వారికి 10లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. చికిత్స పొందుతూన్న కార్మికుల్లో కూడా అనేకమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు, కార్మికుల మృత్యువాతలు పడుతున్న ప్రభుత్వ అధికారులు కానీ, పరిశ్రమల యజమాన్యాలు కానీ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఘటనలు జరిగితేనే అధికారుల పర్యటనలు చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కంపెనీ యాజమాన్యాలు లాభాలే తప్పా కార్మికుల భద్రత పట్టడం లేదన్నారు.

ఆసియా ఖండంలోనే పేరొందిన ఈ ప్రాంతంలో “మృత్యు ఘటన” అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.కనీస సౌకర్యాలు లేకుండా నడుస్తున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవలని అన్నారు. పరిశ్రమల యజమాన్యము లాభార్జనే ధ్యేయంగా రియాక్టర్లు పెళయన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో రియాక్టర్ల వద్ద పని చేయించడం సరైంది కాదన్నారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లతో పని చేయించడం వల్లనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, రాష్ట్ర నాయకులు రమేష్, వెంకటేశ్, జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్ రావు, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, వాజిద్ అలీ, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago