Districts

రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించిన _చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌

మనవార్తలు , పటాన్ చెరు:

క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహకారంతో ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని చిట్కుల్‌ సర్పంచి నీల మధు ముదిరాజ్‌ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ హరిబాబు పిల్లలు కారుణ్య, హర్షవర్ధన్‌లు రెజ్లింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడళ్లు సాధించిన సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శాలువాకప్పి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రీడాకారుల ఉన్నతి కోసం ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు.

ఓపెన్‌ కేటగిరిలో కారుణ్య ఈనెల 18 నుంచి 20 తేదీ వరకూ అత్తాపూర్‌లో 3 వ సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ మహిళా రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుని, గోల్డ్‌మెడల్‌ సాధించడం గర్వకారణం అన్నారు. అలాగే హర్షవర్థన్‌ నవంబర్‌ 29 న అండర్‌ 15 విభాగంలో రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో 52 కేజీల కేటగిరిలో గోల్డ్‌ మెడల్‌ సాధించాడని తెలిపారు. అంతేకాక ఈనెల 15, 16 తేదీల్లో జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కేటగిరిలో జాతీయ స్థాయి పోటీల్లో 5 స్థానం గెలుచుకున్నారని, ఇలాంటి పిల్లలను కన్న తల్లి దండ్రులు అదృష్ట వంతులని చిట్కుల్‌ సర్పంచ్‌ నీలం మధు ముదిరాజ్‌ తెలిపారు. క్రీడలకు, క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తుంటానని నీల మధు ముదిరాజ్‌ తెలిపారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago