మనవార్తలు ప్రతినిధి , మియాపూర్:
సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రజా షెల్టర్స్ కమిటీ హాల్, మియాపూర్‌లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించబడింది.సామాజిక సేవ పట్ల అంకితభావంతో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్న యలమంచి ఉదయ్ కిరణ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విశేష సేవలందిస్తున్నారు. తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందడమే కాకుండా, పలు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు అందుకుని తెలంగాణకు, మియాపూర్‌కు గర్వకారణంగా నిలిచారు.
యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, ఆరోగ్యం, యువజన అభివృద్ధి, సామాజిక సంక్షేమం వంటి అనేక రంగాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, జ్యామితీ బాక్సుల పంపిణీ, వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, ఉచిత తాగునీటి పంపిణీ, వృద్ధాశ్రమాల్లో పండ్ల పంపిణీ, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, అనాథాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, క్రీడా రంగం అభివృద్ధి,వికలాంగులకు అవసరమైన సామగ్రి, విద్యా సహాయం, యువతకు క్రీడా సామగ్రి, అవార్డుల పంపిణీ, వాలీబాల్, కేరమ్ బోర్డుల పంపిణీ, ఉచిత కంటి పరీక్షల శిబిరాలు, పేద విద్యార్థులకు ఫీజు సహాయం, మహిళా దినోత్సవ వేడుకలు, గ్రేస్ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ కార్మికులకు ఫుడ్ డ్రైవ్, సమ్మర్ కూలింగ్ స్టేషన్ల ఏర్పాటు, అలాగే అనుబంధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ సమాజంలో విశేష గుర్తింపు పొందుతోంది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప సేవా కార్యక్రమమని, యలమంచి ఉదయ్ కిరణ్ సామాజిక సేవలో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు.ఉదయ్ కిరణ్ తనకి అత్యంత సన్నిహితుడు,హృదయానికి దగ్గరైన వ్యక్తి,యువకుడు ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం అని తెలిపారు.ఉదయ్ చేస్తున్న అన్ని కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయని,చాలా మంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశాసించారు ,యువ శక్తి ని ప్రోత్సహించడం మనందరికీ బాధ్యత అని,ఇలాంటి గొప్ప కార్యక్రమాలని చేపడుతున్న వ్యక్తికి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరమవుతున్న పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప మానవతా సేవ అని కొనియాడారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ “మియాపూర్ డివిజన్ ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా ప్రధాన లక్ష్యం. ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా వందలాది మందికి అవసరమైన వైద్య సేవలు అందించగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాము. మా సేవా కార్యక్రమాలకు సహకరిస్తూ, ప్రోత్సహిస్తున్న ముఖ్య అతిథులు, వైద్యులు, వాలంటీర్లు, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు మరియు ప్రతి ఒక్కరికీ మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
అలాగే మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ యాజమాన్యానికి ఉచిత వైద్య సేవలు, ఉచిత రవాణా సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రజా షెల్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శంకర్, రెడ్డమ్మ, గోపాలకృష్ణ, శ్రీను, శ్రీనివాస్,సుబ్బ రాయుడు,విజయ్ ,వెంకట్ మరియు రామకృష్ణ గారికి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 400 మందికి పైగా ప్రజలు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, నిపుణులైన వైద్యుల సలహాలు, అవసరమైన మందులు మరియు ఆరోగ్య మార్గదర్శకాలను ఉచితంగా పొందారు.
ఈ కార్యక్రమంలో వీరమల్ల వీరేంద్ర గౌడ్,నడిమింటి కృష్ణ,పట్వారీ శశిధర్ , రావిపాటి వెంకటేశ్వర్లు ,గోవర్ధన్,సాంబశివరావు,రాజు,రాజన్,శ్రీహరి,మూర్తి,భారత్, బాబ్జీ,సత్యనారాయణ,సత్య రెడ్డి,పద్మిని,శ్రీకాంత్,శరత్,నాని,సాంబయ్య,అశోక్,మధు,ఉదయ్,శ్రీరామ్,కార్తీక్,విజయభాస్కర్, నరేందర్ రెడ్డి, పద్మ, సాయి కృష్ణ, మోహన్ రెడ్డి, ఎంసీ రెడ్డి, కృష్ణ, షా, కేవీ రావు, శేఖర్, నవ్యశ్రీ, శ్రీనివాసులు, సత్యనారాయణ, రాజేష్, కార్తీక్, దినేష్, గిరి, సీహెచ్ సాంబయ్య, బాలమురళి, నవీన్, సాధన, తాండ్ర రామచంద్ర గౌడ్, వెంకటేష్, శివ ముదిరాజ్, ప్రవీణ్, నాగసాయి, వినోద్, వంశీ చౌదరి, వాసు కామినేని, సాయి నిఖిల్, రత్నచారి, మధు, శరత్, రాధాకృష్ణ, శివప్రసాద్, సర్దార్, కర్రి నాని, అశోక్, ఇరాన్ జగన్ రామస్వామి, కిరణ్, బండి రామకృష్ణ, సురేష్, సంజయ్, ధనరాజ్, ప్రశాంత్, సల్మాన్, ఆసిఫ్, కరీం, మణిక్, శేఖర్, ప్రసాద్, రఘు, వలభనేని నరసింహరావు, ప్రకాష్, సత్య, శేషగిరిరావు తదితర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
“
