యాజమాన్యం స్పందించకపోతే సమ్మెను తీవ్రతరం

politics Telangana

కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ

చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ యాజమాన్యం యూనియన్ ఏర్పాటు చేశారని నెపంతో కక్ష కట్టి కార్మికులను అక్రమంగా తొలగించడం దుర్మార్గమని బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ అన్నారు.యూనియన్ గుర్తించాలని అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని కార్మికులు చేపట్టిన సమ్మె 16రోజు పరిశ్రమ వద్ద నిరసన, ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంకు కార్మిక శాఖ అధికారులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అవసరమైతే చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తామన్నారు.కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.చట్ట విరుద్ధంగా కార్మికులను ఎట్ల తొలగిస్తారని ప్రశ్నించారు కార్మిక శాఖ అధికారులు తక్షణమే స్పందించి చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.యాజమాన్యం స్పందించకపోతే సమ్మె పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, బిస్లరీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి నాయకులు నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *