మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్:
పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ కాలనీ, హెచ్ఎంటి శిల్ప లేఔట్ కాలనీ, పిఎన్ఆర్ కాలనీలలో ఒక కోటి 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో గల ప్రతి పార్కు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పార్కుల అభివృద్ధి ద్వారా ప్రజలకు ఆహ్లాద వాతావరణంలో పాటు పచ్చదనం పెరగడంతో పాటు కాలనీలలో స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. ప్రతి పార్కులో పిల్లలకు ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్ సురేష్, డి ఈ వెంకటరమణ, పార్కుల విభాగం మేనేజర్ సతీష్, మాజీ కౌన్సిలర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్, జగదీష్, కృష్ణ, మహదేవ రెడ్డి, రాములు, బిజిలి రాజు, కాట సునీత, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.
