– ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి – సాయిబాబా
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ కాలనీ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరి శెట్టి సాయిబాబా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లు పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు టెక్స్ట్ బుక్ లు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకొని అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. సమాజంలో మంచిగా మెలుగుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ప్రధానాచార్యులు శ్రీనివాసులు, మరియు సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షులు కృష్ణ గౌడ్, ప్రవీణ్ ముదిరాజ్, రమేష్ గౌడ్ మరియు కళాశాల అధ్యపక, ఆధ్యాపాకేతర బృందం పాల్గొన్నారు.
