చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవడం నేరమా..?
అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడి
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
బిస్లరి పరిశ్రమను తనిఖీ చేసిన డిప్యూటీ లేబర్ కమిషనర్ (డీసీఎల్)
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకోవాటం నేరమా..? అక్రమంగా డిస్మిట్ చేసిన కార్మికులను వెంటనే తీసుకోవాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ పేర్కొన్నారు.ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లోని బిస్లరీ (వాటర్) ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికులు శుక్రవారం రెండో రోజు సమ్మెలో పాల్గొని పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ఎనిమిది నెలలుగా శాంతియుతంగా సమస్య పరిష్కారం కోసం యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, అక్రమంగా డిస్మిస్ చేసిన కార్మికులను డ్యూటీలో తీసుకోవాలని యూనియన్ తో చర్చలు జరిపి వేతన ఒప్పందం కోసం ముందుకు రావాలని కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం జీవో 6ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులను యాజమాన్యం రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని, యాజమాన్యం యొక్క మొండి వైఖరితోనే కార్మికులు తప్పని పరిస్థితులో సమ్మెలోకి దిగవలసి వచ్చిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తన మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు నాయకులు వెంకటేష్ యూనియన్ నాయకులు శేఖర్ రెడ్డి, నవీన్, నాగరాజు, ప్రవీణ్, సతీష్, అజయ్ దగ్గర కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బిస్లరీ పరిశ్రమను తనిఖీ చేసిన డిప్యూటీ లేబర్
పాశం మైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ పరిశ్రమను శుక్రవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ యాదయ్య తనిఖీ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరికి వెళ్లి అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పరిశ్రమలోకి వెళ్లి పరిశీలించి యాజమాన్యంతో మాట్లాడి త్వరగా కార్మికుల సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
