మనవార్తలు , హైదరాబాద్
కరోనా క్లిష్ట సమయంలో సేవలందించిన వ్యక్తులను సన్మానించడం మన సాంప్రదాయమని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి ఢిల్లీ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు .హైదరాబాదు చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రౌడ్ అఫ్ ఐకాన్ 2022 వ వార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సముద్రాల వేణుగోపాలచారి చేతులమీదుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ 34 వ వార్డు ఆ సంస్థ చైర్మన్ బలరాం అందుకున్నారు. గత ఐదేళ్ళుగా ఏన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తమ సేవలు గుర్తించి అవార్డులతో సత్కరించడం తమకెంతో సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఛైర్మన్ బలరాం అన్నారు .
ఈ అవార్డు దక్కడం వల్ల సామాజిక సేవలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఇన్ని అవార్డులు రావడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది అని అన్నారు ప్రజా సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేశామని ,ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సముద్రాల వేణుగోపాలచారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు .
ముందు ముందు రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు .ఈ అవార్డులు రావడం వల్ల మరింత బాధ్యతతో సేవ కార్యక్రమాలు నిర్వర్తిస్తామన్నారు. సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని తెలియచేస్తున్నాను ఈ అవార్డును అందించిన మయూరి ఆర్ట్స్ వారికి శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరుపున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇటువంటి సేవలను గుర్తించి శ్రీ బలరాం ప్రౌడ్ ఆఫ్ ఐకాన్ బిరుదును అందించడం జరిగింది అని మయూరి ఆర్ట్స్ సంస్థ వారు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…