రామచంద్రపురం:
శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. కరోనా కష్టకాలంలో , లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందుకోవడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఆదివారం కింగ్ కోటి లోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ముఖ్య అతిథిగా కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి గారి చేతుల మీదుగా నంది అవార్డును అందజేశారు ముందు రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని సేవలో వుండే మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతూ కార్యక్రమాలు వుంటాయని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం తెలిపారు
అలాగే . ఆర్ కే కళ సంస్కృతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రంజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ,లాక్ డౌన్ సమయంలో అర్థకలితో బాధపడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీ బాలాజీ ఫౌండేషన్ కు మొదటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మీయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .రాబోయే రోజుల్లో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామన్నారు. సామాజిక సేవలో తమ వంతు సాయంగా అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు .తాను పుట్టి పెరిగిన రామచంద్రపురం పట్టణ ప్రజలకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు బలరాం తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…