Andhra Pradesh

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారు నిక్షేపాలు.. టన్నుమట్టిలో 4 గ్రాముల పసిడి

-బొక్సంపల్లి, జౌకుల పరిధిలో బంగారు నిక్షేపాలు

-కాంపోజిట్ లైసెన్స్ కోసం త్వరలో ఈ-వేలం

అనంతపురం:

రతనాల సీమ రాయలసీమలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది. జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండు చోట్ల, కదిరి మండలంలోని జౌకుల పరిధిలో ఆరు చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఈ పది ప్రాంతాల్లో 97.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

పైన పేర్కొన్న ప్రాంతాల్లో 50 మీటర్ల నుంచి దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. టన్నుమట్టిలో నాలుగు గ్రాములు ఉంటుందని, జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలో రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నుల నిల్వలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.ఈ ప్రాంతాల్లో ఖనిజాల అన్వేషణ కోసం కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. ఒక్కో వ్యక్తి లేదంటే సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు అన్వేషించుకునేందుకు లైసెన్స్  ఇస్తారు. పూర్తిస్థాయిలో నిక్షేపాలు గుర్తిస్తే మైనింగ్ లీజు కేటాయిస్తారు. త్వరలోనే ఇందుకు ఈ-వేలం నిర్వహిస్తారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago