Categories: politicsTelangana

రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

పటాన్‌చెరు ఏపీఆర్ లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ నిర్మాణ పనుల పరిశీలన

నూతన దేవాలయం నిర్మాణాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం

ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి 75 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. బుధవారం ఉదయం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించినట్లు గుర్తు చేశారు.

 

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

12 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

12 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

12 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

12 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

22 hours ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago