ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి…
– కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
పటాన్ చెరు:
కరోనా కట్టడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉన్న అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కాలనీవాసులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ముదిరాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీకాపై ఉన్న అనవసర అపోహలు మాని ప్రజలంతా టీకా వేయించుకోవాలని తెలిపారు. టీకా వేయించుకునే సమయంలో ప్రజలంత మాస్కు దరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. సింఫనీ పార్క్ హోమ్స్, ప్రణీత్ ప్రణవ్ హోమ్స్, ప్రణీత్ కౌంటీ, సిద్దార్థ హోమ్స్, నందన్ రతన్ ప్రైడ్, ప్రణీత్ గ్రీన్ ఫీల్డ్స్, గ్రీన్ మీడోస్ తదితర కాలనీల వాసులు టీకా వేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీరంగుడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ఏనుగు తులసిరెడ్డి, నాయకులు ఈర్ల శ్రీకాంత్, జ్ఞానేశ్వర్, సింఫనీ పార్క్ హోమ్స్ ప్రెసిడెంట్ విజయ్ రాజ్, రాకేష్ రెడ్డి, రాహుల్, కార్తిక్, మణిపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…