PARK
జిహెచ్ఎంసి పరిధిలోని ప్రతి వార్డు లో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ఇందులో భాగంగా రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్, ఆల్విన్ కాలనీ లలో తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో పార్కు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక హంగులతో ప్రతి డివిజన్ పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రారంభించిన హరితహారం మూలంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రాఘవేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటేశ్, శ్రీధర్ చారీ, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…