అనంతపురం :
గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయ స్థాయి బాలికల బాక్సింగ్ పోటీల్లో నగరానికి చెందిన దీక్షిత,పెద్దక్క,శిల్ప,గీత,పూజలు పతకాలు సాధించారు. వీరంతా మంగళవారం ఎమ్మెల్యే అనంతను ఆయన స్వగృహంలో కలిశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి, బాక్సింగ్ కోచ్ మహేష్ కుమార్,అబ్జల్ తదితరులు పాల్గొన్నారు
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…