Telangana

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వివిధ కార్మిక సంఘాలు.

_కార్మిక రంగానికి పెనుముప్పుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు

_కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్

_23న పటాన్చెరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

దేశంలో 80 శాతం కలిగిన కార్మిక లోకానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెనుముప్పుగా మారుతున్నాయని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, కార్మిక రంగానికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలుస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా కార్మికులు వివిధ పరిశ్రమంలో పనిచేస్తూ జీవిస్తున్నారని తెలిపారు.. వారి ఆర్థిక అభ్యున్నతికి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు. దేశానికి ఖ్యాతిని తెచ్చిన బిహెచ్ఇఎల్ బిడిఎల్ ఓడిఎఫ్ లాంటి పరిశ్రమలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా నిర్వీర్యం చేయడంతో పాటు వాటికి సంబంధించిన ఆస్తులను ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు.నవరత్న పరిశ్రమలో ఒకటైన బిహెచ్ఇఎల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం వర్క్ ఆర్డర్లు నిలిపిస్తే సీఎం కేసీఆర్ ఒకే ఒక్క భారీ ఆర్డర్ అందించి పరిశ్రమకు జీవం పోసారని అన్నారు.60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడం మూలంగా లక్షల సంఖ్యలో కార్మికుల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టి.. 24 గంటల పాటు విద్యుత్తు అందించడంతోపాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర పద్ధతులు ప్రవేశపెట్టారని తెలిపారు.కార్మికుల ఆరోగ్య భద్రత కోసం 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి అతి త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23వ తేదీన పటాన్చెరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.అనంతరం బిహెచ్ఎల్ ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, టిఎన్టియుసి నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, కనీస వేతనాల సలహామడలి మాజీ చైర్మన్ రామ్మోహన్రావు, టివి రావు, నర్రా బిక్షపతి, వరప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, అంజయ్య , వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago