Telangana

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి_ పటాన్ చెరు సిఐ వినాయక్ రెడ్డి

భగత్ సింగ్ వర్ధంతి సభలో పటాన్ చెరు సిఐ వినాయక్ రెడ్డి

వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

సిఐటియు ఆధ్వర్యంలో ప్రణం ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి తెలిపారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్రణం ఆస్పత్రి సహకారంతో ముత్తంగి డివిజన్ లోని దేవి నర్సింగ్ స్కూల్లో జరిగిన ఉచిత వైద్య శిబిరం కు పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ మెడికల్ క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు అని ఆరోగ్యమే మహాభాగ్యమని ఆయన అన్నారు.ఎన్ని డబ్బులు ఉన్నాయని ముఖ్యం కాదని, ఆరోగ్యం ఎంత బాగున్నది అనేది ముఖ్యమని, ఇది అందరు గ్రహించాలని ఆయన చెప్పారు. ఆరోగ్యం కోసం అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు, ఆహారం, నీరు, వ్యాయామం క్రమబద్ధీకరణ గా చేయాలని ఆయన సూచించారు. యువతి, యువకులు డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు చాలా దూరంగా ఉండాలని ఆయన కోరారు,

డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, జీవితాలు ఎందుకు పనికిరాకుండా అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, అంతేకాకుండా మీ జీవితాలతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం అవుతాయి అనేది గ్రహించాలని ఆయన విద్యార్థులకు సూచించారు, మీకు భవిష్యత్తు ఉండదు, మీ కుటుంబానికి భవిష్యత్తు ఉండదని, అంతేకాకుండా జైలు శిక్ష కూడా అనుభవిస్తారని ఆయన అన్నారు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు, కుటుంబాలకు తీరని కష్టాలు కొని తెచ్చిన వారవుతారని అన్నారు. భగత్ సింగ్ లాంటి ఆలోచన కలిగి ఉండాలని, ఆయన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన గుర్తు చేశారు.

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య, ప్రణo హాస్పిటల్ మేనేజర్ రామకృష్ణ లు మాట్లాడుతూ దేశం గురించి కూడా విద్యార్థులు, యువతి యువకులు ఆలోచించాలని, దేశానికి స్వతంత్రం ఊరికనే రాలేదని, ఎంతోమంది త్యాగ ఫలితంగానే స్వతంత్రం వచ్చిందని, బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడితేనే వచ్చిందని వారు అన్నారు, కాల్పులకు గురయ్యారని, నిర్బంధం ఎదుర్కొన్నారని, స్వాతంత్రం కోసం ఉరి కంభం సైతం లెక్క చేయలేదని గుర్తు చేశారు. వచ్చిన స్వాతంత్రాన్ని రక్షించుకోవాలని సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సౌజన్య, వైద్యుల బృందం మేఘన, రజిత లెక్చరర్ ,అనిత ,లక్ష్మి, అరవింద్ రాజు, రాజశేఖర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

12 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

12 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

12 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

12 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

23 hours ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago