Telangana

రామప్ప అందాలు చూసి తీరాల్సిందే : ప్రొఫెసర్ కేపీరావు

– గీతమ్ ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం

_ ఆకట్టుకున్న ఫోటో ప్రదర్శన

మనవార్తలు ,పటాన్ చెరు:

ఇసుకపై ( శాండ్ బాక్స్ పద్ధతిలో నిర్మించిన రామప్ప దేవాలయ శిల్ప కళా వైభవాన్ని స్వయంగా చూసి తరించాల్సిందేనని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కేపీ రావు అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎహెచ్ఎస్ ) , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం ‘ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా , హెదరాబాద్ సర్కిల్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఫోటో ఎగ్జిబిషన్ , దృశ్య- శ్రవణ ప్రదర్శనలను ప్రారంభించారు .

మన పురాతన శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనాలెన్నో రామప్ప దేవాలయ కుడ్యాలపై ప్రదర్శించారని , సూక్ష్మ దృష్టితో శిలలను చెక్కినట్టు డాక్టర్ కేపీ రావు చెప్పారు . అదృష్టవశాత్తు ఇది ఏ విదేశీ రాజుల దాడులకు గురికాలేదని , కాకపోతే కొన్ని మానవ తప్పిదాలు , ప్రకృతిలో జరిగే మార్పులు కొంతమేరకు నష్టం చేకూర్చాయని . చెప్పారు . సహజసిద్ధంగా ఏర్పడ్డ కొండలు , అడవి , జలాశయం పక్కన నిర్మించిన ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉండడం వల్లనే యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపునకు నోచుకుందన్నారు . గీతమ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , హ్యుమానిటీస్ , సెన్స్ , ఆర్కిటెక్చర్ వంటి పలు విభాగాల విద్యార్థులతో మమేకమయ్యే అరుదైన అవకాశం తనకు లభించిందని , ఆర్కియాలజీ అంటేనే విభిన్న విభాగాల నెపుణ్యాల మేలు కలయికగా ఆయన అభివర్ణించారు .

వారసత్వ కట్టడాలు , గతాన్ని పునర్నిర్మించడంలో సెన్స్డ్ ఎంతమేరకు ఉపకరిస్తుందో యోచించాలని డాక్టర్ కేపీ రావు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు . రోహిణి పాండే, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్, ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ ,వారసత్వ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు . వారసత్వ సంపదను ఎలా గుర్తించాలి . దానిని ఎలా గౌరవించాలి , ఆ ఘనచరిత్రను భవిష్యత్తు తరాలకు ఎలా చేర్చాలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు . ఎప్పుడో 1212 లో కట్టిన రామప్ప దేవాలయం చాలా ప్రత్యేకమైన ప్రదేశమని , నిర్మాణంలో సెన్ను ఉపయోగించారని , ప్రకృతి కూడా దానికి సహకరించిందని , ఆ దేవాలయం చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ , రిజర్వాయర్లు ఉన్నాయన్నారు . తొలుత , జీఎస్చ్ఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వె.ప్రభావతి అతిథులను స్వాగతించి , సత్కరించారు . ఈ వేడులలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ డీఆర్పీ చంద్రశేఖర్ , కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ వి.అభిలాష్ , డాక్టర్ పూజ పలువురు అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago