Telangana

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్:

వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో యలమంచి ఉదయ్ కిరణ్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విఘ్నేశ్వరుని సన్నిధిలో అన్నదానం చేయడం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన సేవ అని అన్నారు. భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్సవ కమిటీని అభినందించారు. గణనాథుడి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు, స్థానికులకు ఆహారం వడ్డించారు.న్యూ కాలనీలో గజవాకర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, చిరంజీవి నగర్‌లో టీమ్ మహాబల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యలమంచి ఉదయ్ కిరణ్‌ను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో గిరి, రవి, లక్ష్మణ్, సురేష్, న్యూ కాలనీలో ఈశ్వర్, బాబు, చిరంజీవి నగర్‌లో మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

 

admin

Recent Posts

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

2 hours ago

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…

2 hours ago

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

23 hours ago

మియాపూర్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక…

23 hours ago

గోనేమ్మ బస్తీలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు

గణనాథుడికి ప్రత్యేక పూజలు.. ఎమ్మెల్సీ అంజిరెడ్డి  నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని…

23 hours ago

యుక్తితో, నేర్పుగా వ్యవహరించాలి

ఆతిథ్య ఉపన్యాసంలో భారత-పశ్చిమ ఆసియా విధానంపై కల్నల్ రాజీవ్ అగర్వాల్ మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: పశ్చిమ ఆసియాతో భారతదేశానికి…

23 hours ago