Telangana

గీతమ్ లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ), హైదరాబాద్ బుధవారం ‘ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని” నిర్వహించారు. ‘పరిశుభ్రమైన నోటి ఆరోగ్యకరమైన దేహం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో రూట్ కెనాల్, ఫేషియల్ ట్రామా కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రాము నోముల ముఖ్య అతిథిగా హాజరై సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.నోటి ఆరోగ్యం, దైహిక ఆరోగ్య సమస్యల మధ్య సంబంధాన్ని డాక్టర్ రాము ప్రస్తావిస్తూ, నోటి నుంచి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి శరీరంలోనిఇతర భాగాలపై ప్రభావం చూపుతుందన్నారు, పళ్ల మధ్య ఖాళీలు, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన వంటి సాధారణ దంత సమస్యలన నివారించడంలో క్రమబద్ధంగా బ్రెష్ చేసుకోవడం, ఫ్లాసింగ్ వంటి మంచి నోటి పరిశుభ్రత పద్ధతులను ఆయన వివరించారు.

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ కె. మౌనిక మాట్లాడుతూ, సరైన జీర్ణక్రియ, ఆత్మగౌరవం, ఇరుగు పొరుగుతో సులువుగా కలవడం వంటి వాటి కోసం నోటిని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం ఎంతో అవసరమన్నారు. రోజుకు రెండుసార్లు మెత్తటి బ్రెష్ పళ్లు తోమడం, నాలుకను ప్రతిరోజూ శుభ్రం చేయడం, చక్కెరను పరిమితంగా తీసుకోవడం, దంత వెద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం, మరెన్నో నోటి పరిశుభ్రత పద్ధతులను ఆమె వివరించారు.గీతం స్టూడెంట్ లైఫ్ , గీతం ఫార్మసీ స్టూడెంట్ అసోసియేషన్ (జీపీఎస్ఏ) సహకారంతో నిర్వహించిన నోటి ఆరోగ్య అవగాహన శిబిరంలో అతిథులు ఇద్దరూ పాల్గొని, తగు సూచనలు చేశారు. తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్ అతిథులను స్వాగతించి, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ కుమార్ చింతమనేని ఈ కార్యక్రమాలను సమన్వయం చేశారు.నోటి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, సాధారణ ఆరోగ్యానికి దానికి ఉన్న సంబంధం గురించిన అవగాహన, పెంపొందించడానికి ప్రతియేటా మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. నోటి పరిశుభ్రత పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి పెడతారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago