Telangana

గీతమ్లో ద్రవాల భౌతికశాస్త్రంపే కార్యశాల…. పేర్ల నమోదుకు చివరి తేదీ : ఈనెల 25

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని గణిత శాస్త్ర విభాగం ఈనెల 28-30 తేదీలలో ‘ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ‘ ( ద్రవాల భౌతికశాస్త్రం : పద్ధతులు , వినియోగం ) అనే అంశంపై మూడురోజుల కార్యశాలను నిర్వహించనుంది . ఈ విషయాన్ని కార్యశాల నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , డాక్టర్ మోతహర్ రెజాలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ద్రవ గతిశాస్త్రం ప్రాథమిక మోడలింగ్ అంశాలు , హోమోటోపీ పెర్ టర్బేషన్ మెథడ్ ( హెచ్పీఎం ) , ఎల్డీఎం , ఎఫ్పీఎం వంటి విశ్లేషణాత్మక , సంఖ్యా పనులు , ద్రవ ప్రవాహంలో కనిపించే నాన్తీనియర్ అవకలన సమీకరణాలను పరిష్కరించడానికి వర్ణపట పద్ధతులను పరిచయం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యశాల నిర్వహిస్తున్నామన్నారు . సమస్యలను పరిష్కరించడం , మ్యాథమెటికా లేదా మ్యాట్లాబ్లో న్యూమరికల్ టెక్నిక్లపై పనిచేయడంపై కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు .

వివిధ వ్యవస్థలలో ద్రవ రవాణా మోడలింగ్ అంశాలు , ఇంటర్ఫేస్ పరిస్థితుల భౌతికశాస్త్రం , సరిహద్దు పొర సిద్ధాంతం , సారూప్యత పరిష్కారాలు , మెక్రోఫిజిక్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ వంటి ప్రధాన అంశాలు ఈ వర్క్షాప్లో ఉంటాయన్నారు . ఐఐటీ ఖరగ్ పూర్ లోని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జీ.పీ.రాజశేఖర్ , ఐఐటీ హైదరాబాద్లోని రసాయన సాంకేతిక విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు , ఇతర నిపుణులు ఈ కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు .

ఫ్లూయిడ్ డెన్హమిక్స్ పనిచేస్తున్న విద్యావేత్తలు , పరిశోధక విద్యార్థులు , పీజీ విద్యార్థులు కోసం ఈ వర్క్షాప్ను ఉద్దేశించామని , ఆసక్తి గలవారు ఈనెల 25 వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు . ఇతర వివరాల కోసం డాక్టర్ జె.విజయశేఖర్ ( 97 00668875 ) / డాక్టర్ నార్ల వంశీకృష్ణ ( 80744 02 980 ) లను సంప్రదించాలని , లేదా vnarla@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని నిర్వాహకులు సలహా ఇచ్చారు

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago