Telangana

రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

_పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలవ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, పిఎసిఎస్ అధ్యక్షులు బిక్షపతి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago