_పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలవ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, పిఎసిఎస్ అధ్యక్షులు బిక్షపతి, మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…