Hyderabad

ప్రజలకు జవాబుదారీగా పని చేయండి_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, చేపట్టబోయే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ రహదారిపై గల విద్యుత్ స్తంభాల నిర్వహణ సరిగా లేదని, వెంటనే సంబంధిత సిబ్బందితో చర్చించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మూడు డివిజన్ల పరిధిలో పాత విద్యుత్ స్తంభాలు తొలగించాలని ఆదేశించిన, అధికారులు సత్వరమే స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాత విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలు అమర్చాలని అధికారులకు సూచించారు. కొన్ని శాఖల్లో ఫీల్డ్ స్థాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం మూలంగా స్థానిక ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వస్తుందని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

మిషన్ భగీరథ ద్వారా బండ్లగూడ పరిధిలో పలు కాలనీలకు మంచి నీరు రావడం లేదని కార్పొరేటర్ కుమార్ యాదవ్ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. మూడు డివిజన్ల పరిధిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా శానిటేషన్ సిబ్బందినీ పెంచాలని జోనల్ కమిషనర్ రవికిషోర్ కు సూచించారు. ఉదయం 5 గంటల లోపు కింది స్థాయి సిబ్బంది నుండి జోనల్ స్థాయి వరకు గల అధికారులందరూ వార్డుల్లో పర్యటిస్తే సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు త్వరితగతిన పరిష్కరించవచ్చని అన్నారు.

 

ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తే సిబ్బందిలో జవాబుదారితనం పెరుగుతుందని అన్నారు. ఇక నుండి ప్రతి ఆరు నెలలకొకసారి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పటాన్చెరు, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి పీల్చే వారికి అడ్డాలుగా మారుతున్నాయని, అమాయక విద్యార్థులు , యువత వీటి బారినపడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్సైజ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి, గంజాయి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విద్యార్థులకు కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఇక నుండి సమీక్ష సమావేశాలకు హాజరయ్యే అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల, హెచ్ ఎం డబ్ల్యు ఎస్, హెచ్ఎండీఏ, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago