Telangana

మహిళా శక్తే సమాజానికి దిక్సూచి కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి

మహిళల సంఘటిత శక్తిని బలోపేతం చేస్తున్న కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతి నగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సమావేశం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళల ఐక్యతకు, సాధికారతకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళల నుంచి కొత్తగా మహిళా గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహిళా గ్రూప్ ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశమై సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతో పాటు మహిళల అభివృద్ధి, హక్కుల సాధన, సమాజ సేవ లక్ష్యంగా పనిచేయనుందని స్పష్టం చేశారు. అనంతరం కార్పొరేటర్ సింధు ఆధర్శ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంఘటితంగా ముందుకు వస్తే సమాజంలో ఎలాంటి మార్పునైనా సాధించగలరని పేర్కొన్నారు. మహిళల ఐక్యతే సామాజిక మార్పుకు పునాదని, మహిళల అభివృద్ధి లేకుండా సమాజ పురోగతి సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. మహిళా శక్తిని ఎప్పుడూ ప్రోత్సహించే నాయకత్వంగా తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని భరోసా ఇస్తూ, కొత్తగా ఏర్పాటైన మహిళా గ్రూప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా ఆర్యవైశ్య మహిళా గ్రూప్ సభ్యులు ధ్యానేశ్వరి, శ్రీలతతో పాటు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago