Telangana

నూతన పాంట్ల ఏర్పాటుతో చెరువులకు మహార్దశ

1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో

7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు

త్వరలో పనుల ప్రారంభం

సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి ఎస్టిపి విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన ఎస్టిపి ప్లాంట్ల ఏర్పాట్లపై సమగ్ర నివేదికను ఎమ్మెల్యేకు అందించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బిఓటి పద్ధతిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిసాట్, గండిగూడెం, బచ్చు గూడెం, అమీన్పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు 1100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఎందుకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు భూ కేటాయింపులు జరపాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ అధికారులకు సంబంధిత శాఖ అధికారులు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్లాంట్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, 40% సంభందిత కాంట్రాక్టర్ కు బి ఓ టి పద్ధతిలో నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెరువులు, కాలువలను మరీగ్ నీరు, కాలుష్యం బారి నుండి సంరక్షించుకోవడంలో ప్లాంట్ల ఏర్పాటు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. అతి త్వరలో భూ కేటాయింపులు జరిపేందుకు కృషి చేయనునట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ అధికారులకు తెలిపారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, జలమండలి డిజిఎంలు బాబు, దీపాలి, శ్రీనివాసరావు, తహసిల్దార్లు రంగారావు, రాధా, సంగ్రామ్, బిక్షపతి, గంగా భవాని, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

10 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

10 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

10 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

22 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago