Telangana

అక్రమ నిర్మాణాలను ప్రోత్సయిస్తున్నది ఎవరు ?

_అన్ని తామై చూసుకుంటున్న ఆ ఇద్దరు ?

_నోటీసులతో కాలయాపన చేస్తున్నారని కాలని వాసుల ఆరోపణ

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెతను టౌన్ ప్లానింగ్ అధికారులు చక్కగా వాడుకుంటున్నారని, అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులె వాటిని ప్రోత్సహిస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఎం ఐ జి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సదరు బిల్డర్లు చెప్పడంతో వీరి బండారం బయటపడుతుంది. ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చి, ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ సదరు అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోక పోగా దొంగలకు ఏడు తోవలు అన్న చందంగా అనుమతులు ఇస్తూనే ఎవరైనా వచ్చినా, పిర్యాదులు చేసినా మీరు ఇలా చెప్పండి, అలా చెప్పఁoడీ అంటూ సలహాలు ఇస్తూ లక్షలు వసూలు చేశారనే బలమైన ఆరోపణలున్నాయి. ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ ఇష్టాను తీరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా అడ్డగోలుగా 4,5 అంతస్థులలు, పెంటౌస్ లు నిర్మించడం వల్ల జనాభా పెరిగి పోయి, త్రాగు నీరు, సరిపోవడం లేదని, డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయని కాలని వసూలు ఆరోపిస్తున్నారు.

భెల్ పాత ఎం ఐ జి కాలని ఇటు శేరిలింగంపల్లి, అటు ఆర్.సి పురం రెండు సర్కిళ్ల మద్ధ్యలో ఉంది. కొంతభాగం ఇటు మరి కొంత భాగం అటు వస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అయితే కొందరు రాజకీయ నాయకులు వీరికి అండగా ఉండడం అక్రెమార్కులకు కల్సివస్తుంది. ఎమ్మెల్యే నో, కార్పొరేటరో, లేక మరో లీఫర్లొ ఇలా వారి పేర్లు చెప్పుకొని తమపని చక్కబెట్టుకుంటున్నారు. ఎం ఐ జి ప్లాట్ నెంబర్లు 103, 929, 645, 334, 2325, 643 ఎదురుగా, 642 పక్కన, 214 మరియు 204 మధ్యలో ఒకటి, 446, 469 ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. వీటిపై తక్షణమే చర్యలు చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు. వీటిపై గత రెండు నెలలుగా పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. జనాభా ప్రతిపాదికన వేసిన రోడ్లు డ్రైనేజీ పైప్ లైన్లు పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక, సిమెంటు, కంకర, స్టీలు ఇతర సామాన్లు పెద్ద పెద్ద టిప్పర్లలో తీసుకురావడం వల్ల డ్రైనేజీ పైప్ లైన్లు మ్యాన్ హోల్స్ మూతలు పగిలిపోతున్నాయని, వాపోతున్నారు.రోడ్లు పాడైపోయి గుంతలు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల కాలనీలో జనాభా పెరిగిపోయి ప్రభుత్వం ఇచ్చే మంజీరా త్రాగునీరు సరిపోవడంలేదని, అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని వారు కోరుతున్నారు.ఈ అక్రమాలలో ఇద్దరు వ్యక్తులు వెనుక ఉండి నడిపిస్తున్నారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ఇద్దరు ప్రముఖులు రాజకీయ నాయకుల ? అధికారుల ? అనే విషయం మాత్రం కాలనీవాసులు చెప్పడం లేదు. ఈ తతంగాన్నీ అంతా నడిపిస్తున్నది ఎవరనేది త్వరలో తేలుతుందని వారు పేర్కొన్నారు.

నోటీసులు జారీ చేశాం – సెక్షన్ ఆఫీసర్ విశాల్

ఈ అక్రమాల విషయమై టౌన్ ప్లానింగ్ సెక్షన్ఆఫీసర్ విశాల్ ను వివరణ కోరగా సదరు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని, వారందరికీ నోటీసులు జారీ చేశామని తెలిపారు. కొందరు రాజకీయ ప్రముఖులు మాపై ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని, కానీ మా డ్యూటీ మేము చేస్తామని ఆయన తెలిపారు. అక్రమ నిర్మాణాలాన్నిటికి నోటీసులు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ వారికి చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసేమని ఆయన పేర్కొన్నారు.

_త్వరగా సున్నం వేసుకోండి ఎవరు మీ జోలికి రారు..

వార్త పత్రికల్లో వార్త ప్రచారం అయినందువల్ల మీపై చర్యలు తీసుకోబడతాయని మీరు త్వరగా బయట సున్నం చేసుకొని లోపల వర్కు మెల్లగా చేసుకోండి అని సంబంధిత శాఖ అధికారులు అక్రమ నిర్మాణదారులకు సూచించినట్టు తెలిసింది. ఇలా పేపర్లలో వచ్చిన వార్తలు అడ్డం పెట్టుకొని అక్రమ నిర్మాణా దారులకు సలహాలు, సూచనలు ఇచ్చి తమకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ను వసూలు చేసుకున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమనే నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటారని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago