జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు
జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి :
సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించి..ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశాన్ని అందించిన మహోన్నత నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సొంత నిధులతో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గురువారం గాంధీ జయంతి రోజున ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మహనీయులు భౌతికంగా గతించినప్పటికిని వారు చూపిన మార్గం, అనుసరించిన విలువలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాయకంగా నిలుస్తాయని అన్నారు. నేటికీ ప్రపంచంలోని ప్రతి దేశంలో గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన దేవి మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…