పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని సొంత నిధులతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తుల్లో ప్రథముడు బాపూజీ అని కొనియాడారు. తొలి దశ, మలి దశ తెలంగాణ పోరాటంలో బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…