పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకుంటామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మెదక్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో బీసీలు గెలిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని , తమ శక్తి మొత్తాన్ని ఉపయోగించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లాలోని ప్రజా సంఘాలన్నిటిని ఏకం చేస్తామన్నారు. బీఆర్ఎస్, బిజెపిలు ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని, ఈ ఎన్నికలలో ఆయా పార్టీలను ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మెతుకు సీమ నుంచి బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధును గెలిపించుకుంటామని ప్రొఫెసర్ కోదండరాం దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ నేత హనుమంత రెడ్డి, టీజేఎస్ నేతలు నిజ్జన రమేష్, అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బి. రమేష్, సర్దార్, వినోద్, ఆశప్ప, తుడుం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…