– ప్రజలకు మంచి పాలన అందేయడమే టీఆర్ఎస్ లక్ష్యం
– రాజధాని రణభేరిలో కవిత
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలలో అన్ని డివిజన్ లాలో పోటీ చేసి బల్దియాలు టిఆర్ఎస్ జండా ఎగరవేస్తామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ వాసిలీ చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన రాజధాని రణభేరి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి అభ్యర్థి అయిన శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించాలని కోరారు. ఇక ముందు రాబోయే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నారు.జి హెచ్ఎంసి లో నీ 300 డివిజన్లలో కూడా కూడా పోటీ చేస్తామని, ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ ను
కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకోలేదనీ, హైదరాబాద్ 400 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని, ఆ చరిత్ర ను తెలుసుకోవాలనీ, చరిత్ర తెలవలేనోడు నాయకులు కాలేర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో కోటి మంది జనాభా కు కావాల్సిన అవసరాలు ఇప్పుడున్న ప్రభుత్వం తీర్చడం లేదని, మనం ఆ అవసరాలు తీర్చానీ. పేర్కొన్నారు.
వందల ఏళ్ల క్రితం ముత్యాలను సృష్టించిన ఘనత సైబరాబాద్ కు ఉందని ఇపుడు ఐటీ రంగంలో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానంలో ఉందని,ఐటీ ఉద్యోగుల కోసం ఒక పాలసీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడిదారులకు స్వాగతం పలకాలని, కానీ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడనీ, మళ్ళీ వచ్చే ఆర్థిక సమ్మిట్ లో ఏం చేస్తారో చెప్పండనీ కోరారు. డమ్మీల సమ్మిట్ ల పేరుతో రావద్దని హెచ్చరించారు.మన పార్టీకి కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తలు కావాలనీ సూచించారు.
విశ్వ నగరం అని చెప్పుకుంటున్నాం కానీ నగరంలో మంచి నీళ్ళు లేవనీ నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నా మన్నారు.మన వాళ్ళు గల్లిల్లో తిరగాలనీ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలనీ. ప్రజల కోసం పని చేద్దామని పిలుపు నిచ్చారు. చెత్త గురించి అయితే చెప్పాల్సిన పనే లేదనీ, నగరంలో ఉన్న 50 వేల మంది కార్మికుల పొట్టకొడుతున్నా రనీ. ఇది న్యాయమా అని ప్రశ్నించారు. అలా చేస్తే చూస్తూ ఊరుకో మనీ. సీఎం ఇంటిముందు చెత్త పోసి నిరసన తేలుపుతామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం కూరగాయలు అమ్మే వారికి ఏసీ ఆటోలు ఇవ్వాలనీ కోరారు. నగరంలోని రోడ్ల కోసం11 వేల నిధులున్నాయనీ, కానీ రోడ్లు మాత్రం గుంతల మయంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గర్భిణీ ల గురించి. ముసలలోల్ల గురించి ఆలోచించాలనీ రోడ్లు బాగు చేయాలని కోరారు. కుక్కల, దోమల బెడద ఎక్కువగా ఉందని, దోమలు టవర్లు కట్టాయనే వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుందన్నారు.హైదరాబాద్ నగరానీది ఏ ఆలత్ ఉండేదని ఏం అలత్ అయిందన్నారు.అన్నిట్లో అవినీతే మిగిల్చారనీ, మంచి మార్పు కోసమే పార్టీ పెట్టామనీ పేర్కొన్నారు.మానవత్వం తో కూడిన పాలన రావాలనీ, హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండించాలి. కానీ రెడ్డి బ్రదర్స్ వల్ల అన్ని పంటలు పోయాయన్నారు. యువత కోసం కొత్త తరం ఆలోచనలతో ముందుకు వెళ్తామన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు మనవార్తలు ప్రతినిధి, మియాపూర్:…
- నియామకం పత్రం అందజేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ రక్షణ సేన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా మరియు రసాయన పరిశ్రమలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ యంత్రాంగం, ఫ్యాక్టరీస్ మరియు…
గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ కొత్త నాయకత్వ బృందానికి బాధ్యతలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు…
హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…